Minister Puvvada Ajay: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు.
అయితే ఈ సభకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కమార్ స్వామి( kumara swamy) ని కేసీఆర్ ఆహ్వానించారు. అయితే ఖమ్మం సభకు కుమార స్వామి పాల్గొనలేదు.
దీనిపై బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ వివరణ ఇచ్చారు. కుమార స్వామి పాద యాత్రలో ఉండటం వల్ల ఖమ్మం సభకు హాజరు కాలేక పోయారని తెలిపారు.
అందుకు సంబంధించి సీఎం కేసీఆర్ కు సమాచారం అందిందని పువ్వాడ అన్నారు.
కాంగ్రెస్ కు కాంగ్రెస్సే శత్రువు
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ వాళ్లే ఓడించుకుంటారని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించడానికి కేసీఆర్ కుట్ర పన్నారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పువ్వాడ స్పందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించడానికి తాము కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ కు కాంగ్రెస్ శత్రువులమని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని పువ్వాడ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ విజయవంతం అయిందన్నారు. సభకు లక్షల్లో కార్యకర్తలు పాల్గొన్నారన్నారు.
బండి సంజయ్ పై పువ్వాడ ఫైర్
మరో వైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పువ్వాడ(Minister Puvvada Ajay) ఫైర్ అయ్యాడు.
ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో భాగంగా కళ్ల పరీక్షలు చేసుకోవాలని సూచించాడు.
ఒక వేళ చూపించుకునేందుకు వెళ్లలేకపోతే బండ దగ్గరకే కంటి వెలుగు టీమ్ రు పంపిస్తామని పువ్వాడ సెటైర్లు వేశారు.
మరో వైపు 24 గంటల కరెంట్ గురించి బండి కి సందేహాలు ఉంటే ఒక్కసాని కరెంటు తీగను పట్టుకోవాలని సూచించారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మల్యే కోరం కనకయ్యపై కూడా పువ్వాడ అజయ్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సభకు వచ్చిన వారందరికీ బొట్టు పెట్టి చెప్పామా అని ప్రశ్నించారు.
ఖమ్మం భారీ సభ జరుగుతున్నపుడు జిల్లా నాయకులందరీ ఫ్లెక్సీలను పెట్టడం తమ సంస్కారం అయితే మీటింగ్ కు రాకపోవడం వాళ్ల సంస్కారం అని అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/