Site icon Prime9

Michael Trailer: అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ మనిషి జీవితం.. హైప్ క్రియేట్ చేసిన సందీప్ కిషన్

sundeepkishan

sundeepkishan

Michael Trailer: యంగ్ హీరో సందీప్ కిషన్ (sundeepkishan)నటిస్లున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’.

రంజిత్ జైకోడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరుణ్ సందేష్, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ రావడంతో సినిమా ట్రైలర్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మైఖేల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

యాక్షన్ డ్రామాగా ట్రైలర్

ట్రైలర్ ను సందీప్ కిషన్ ట్విటర్ లో షేర్ చేశారు.

‘ఒక అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ మనిషి బ్రతకాలి.. ప్రేమలో పోరాడి దానిని దక్కించుకోలేక పోయిన ప్రతి మనిషికి ఈ ట్రైలర్ ను అంకితమిస్తున్నాం’ అంటూ సందీప్ కిషన్ పోస్ట్ చేశాడు.

ఒక అమ్మాయి ప్రేమ కోసం సాగిన పోరాటమే మైఖేల్ కథాంశమని ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది.

వరుణ్ సందేష్ విలనీ లుక్ లో కనిపించి అలరించాడు. గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి క్యారెక్టర్లు సరికొత్తగా అనిపిస్తున్నాయి.

మరో ముఖ్య పాత్రల్లో అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు.

అదిరి పోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో యాక్షన్ , లవ్ మిక్స్ అయిన సినిమాలా ఉండనుంది.

ట్రైలర్ చూసిన వాళ్లు సందీప్ కిషన్ పాన్ ఇండియా స్థాయిల్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.

లవ్ కమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మైఖేల్ ఫిబ్రవరి 3 న పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధమైంది.

ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమా పై హైప్ క్రియేట్ చేశాడు సందీప్ కిషన్.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ప్రస్ధానం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్.. మైఖేల్ తో హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

సందీప్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

కరణ్ సీ ప్రొడక్షన్ లో ఎల్ ఎల్ పీ శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పీ బ్యానర్ లపై భరత్ చౌదరి పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

 

Exit mobile version