Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి దేశ, విదేశాల్లో ఉన్న అభిమానుల గురించి తెలిసిందే. సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగి మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసిస్తున్న చిరుకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్నయ్య చిరంజీవి కోసం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే వారికి ఎప్పుడు అండగా ఉంటుంటారు. చిరంజీవి దగ్గర నుంచి కొత్తగా సినిమాల్లోకి వచ్చిన వైష్ణవ్ తేజ వరకు అందరికీ వీరి మద్దతు బలంగా ఉంటుంది. అయితే అభిమానఊల కోసం కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆశిస్తూ ఉంటారు చిరు. ఈ మేరకు ఆపదలో ఉన్న ఎందరో అభిమానులకు అండగా నిలిచి వారి ప్రాణాలను కాపాడారు చిరంజీవి. అయితే తాజాగా డల్లాస్ లో స్థిరపడిన మెగాస్టార్ అభిమాని మృతి చెందినట్లు తెలుస్తుంది.
ఈ మేరకు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఆడియో మెసేజ్ పోస్ట్ చేశారు. ఆ ఆడియోలో… నా ప్రియమైన అభిమాని ముకేష్ ఇక లేడన్న వార్తను నేను జీర్ణించుకోలేక పోతున్నాను ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ముకేష్ కుటుంభ్యులకు ఎదురైన ఈ విషాదాన్ని తలుచుకుంటుంటే మనసు కలచివేస్తుంది. నేను 2012 లో డల్లాస్ వెళ్ళాను ,అప్పుడు నాకు ఘన స్వాగతం ఏర్పాటుచేసి, అద్భుతమైన గెట్ టూ గేదర్ ఏర్పాటు చేసిన వారిలో ముకేష్ ఒకరు. దృఢంగా ,ఉత్సహాంగా ఉండే ముకేష్ నాకు స్వాగతం పలకడమే కాకుండా , నన్ను ఎంతో అట్టహాసంగా ఊరేగింపుగా తీసుకువెళ్లిన సీఏఎన్ఏ (చిరంజీవి అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ) బృందంలో కీలక వ్యక్తి అని నాకు తెలుసు.
ఆ రోజు నాకు సీఏఎన్ఏ చేసిన ఘన సత్కారాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నా ఫోటో తో గోల్డ్ కాయిన్స్ ముద్రించిన బృందంలో ముకేశ్ ఒకరు. ఆ మధ్య రెండోసారి డల్లాస్ వెళ్ళినపుడు కూడా నాకు అదే విధమైన సాదర స్వాగతం లభించింది. ‘ మా ‘ అసోసియేషన్ తరపున వెళ్లినా ఏపీటీఏ , సీఏఎన్ఏ బృందం నన్ను వ్యక్తిగతంగా సత్కరించింది. అందులో ముకేష్ కూడా ఉన్నారు . ‘ ఆప్తా ‘ ‘ కానా ‘ ద్వారా ఎన్నో సేవా , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నన్ను ఆదర్శంగా తీసుకున్నామని వారు చెప్పినపుడు సంతోషంతో నా మనసు నిండిపోయింది .
కానీ, ఇంతలోనే ఈ వార్త వినడం నిజంగా బాధాకరం విధి బలీయమైనది. ఈ కష్ట సమయంలో ‘ ముకేష్ ‘ కుటుంబసభ్యులకు మనమందరం అండగా నిలబడాలి. ముకేష్ శ్రీమతి గారికి , పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. ముకేష్ దివ్య స్మృతికి నా కన్నీటి నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.