Maoists: ఏపీలో వైఎస్సాఆర్సీపి దోపిడీపై నిన్నటివరకు ప్రతిపక్షాలు మాత్రమే గొంతెత్తి మాట్లాడాయి. దాన్ని అధికార వైకాపా తిప్పికొడుతూ మాట్లాడిన వ్యక్తులపై తప్పుడు కేసులు బనాయించడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.
మావోయిస్టులు ఈమేరకు లేఖలో పేర్కొన్నారు. అవినీతి అక్రమాలతో వేలకోట్లతో పుట్టినదే వైకాపా పార్టీ. జగన్ అధికారంలోకి వచ్చిన్నప్పటి నుండి ప్రభుత్వ, ప్రజల భూములను ఆక్రమించుకోవడం ఒక విధానంగా మారింది. అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తున్న వైకాపా నాయకులను మన ప్రాంతం నుండి తన్ని తరిమెయ్యాలి. 3 రాజధానుల పేరుతో పార్టీ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచి పెట్టడానికి విశాఖ నగర చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకొన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో కూడా ప్రజల భూములను వైకాపా నేతలు ఆక్రమించుకొన్నారు. వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ దురాక్రమణపై వేలాదిమంది ప్రజలు పోరాడుతున్నా, అధికార బలంతో పోలీసు, రెవిన్యూ శాఖల అండదండలతో తప్పుడు కేసులు బనాయించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ భూములను కబ్జా చేసే క్రమంలో వర్సిటీ ఆవరణలో పరిసర ప్రాంతాల్లో అరాచక కార్యకలాపాలు జరుగుతున్నాయి. పర్యాటక ప్రాంతమైన రుషి కొండపై ఏపీ పర్యాటక సంస్ధ అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి అనేక అక్రమాలకు పాల్పొడుతుంది. అని మావోలు లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనా మావోల లేఖతో ప్రభుత్వం మేలుకొంటుందా, లేదా వారిని కూడా సామాన్య ప్రజలుగా భావించి అంతమోదించేందుకు ప్రయత్నిస్తుందో వైకాపా నేతల తీరుతో బయటపడుతుంది.
ఇది కూడా చదవండి:Telangana: తెలంగాణాలో మావోయిస్టులు యాక్టివ్ అవుతున్నారు….మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు