Maoists: రాయ్ పూర్ లో మావోయిస్టుల దాడి.. ఇద్దరు పోలీసులు మృతి

Maoists: ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Maoists: ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఉదయం కాల్పులు జరిపిన మావోయిస్టులు (Maoists)

చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న బొర్తలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందిపై దాడి జరిగినట్లు.. రాజ్‌నంద్‌గావ్ పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ మీనా తెలిపారు. అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. జిల్లా ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రాజేష్ సింగ్ రాజ్‌పుత్. అలాగే ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ బొర్తలావ్ పోలీస్ క్యాంపు నుండి మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్తున్నారు. వీరి దగ్గర ఆయుధాలు లేవని గుర్తించిన మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పాడినట్లు పోలీసుల గుర్తించారు.

పథకం ప్రకారమే దాడి జరిగిందా..

ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయుధాలు లేకుండా వెళ్లడం గమనించిన మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా నక్సలైట్ల బృందం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడి నుంచి తప్పించుకునే ముందు నక్సలైట్లు తమ మోటార్‌సైకిల్‌ను తగులబెట్టారని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుందని.. పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన మావోయిస్టులను వదిలిపెట్టేది లేదని పోలీసులు అన్నారు. నక్సల్స్ ఏరివేతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. అదును చూసి మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.