Site icon Prime9

Thalapathy Movie: మణిరత్నం, రజనీకాంత్‌ ‘దళపతి’ రీ రిలీజ్‌ ఫిక్స్‌ – మళ్లీ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే!

Thalapathy Movie Rerelease?: డైరెక్టర్‌ మణిరత్నం తెరకెక్కించిన కల్ట్‌ క్లాసిక్‌ హిట్‌ మూవీ రీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మూవీని మళ్లీ థియేటర్లోకి వస్తుండటంతో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. అదే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టిల ‘దళపతి’. 1991లో మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా క్లాసిక్‌ హిట్‌ సాధించింది. మూవీ వచ్చి 30 ఏళ్లపైనే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి.

మహాభారతం ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ‘దళపతి’ చిత్రాన్ని డిసెంబర్‌ 12న రీ రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. ఇది తెలిసి రజనీ ఫ్యాన్స్‌ అంతా పండగ చేసుకుంటారు. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ రీ రిలీజ్‌ ఉంటుందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్‌లో సందేహాలు నెలకొన్నాయి.

మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ‘దళపతి’ చిత్రంలో రజనీ, మమ్ముట్టిలు స్నేహితులుగా నటించగా.. అరవింద్‌స్వామి మరో ప్రధాన పాత్ర పోషించాడు. శోభన, భానుప్రియలు హీరోయిన్లుగా నటించారు. అమ్రిష్‌పురి, జై శంకర్‌. సీనియర్‌ నటి శ్రీదేవిలు కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రం మంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. దీంతో కాంబోలో మరో సినిమా వస్తే బాగుండని ఇప్పటికీ ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో త్వరలోనే మణిరత్నం, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాయకన్‌ తర్వాత కమల్‌ హాసన్‌తో థగ్‌ లైఫ్‌ తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇక కాంబో సెట్‌ అవ్వడంతో.. రజనీకాంత్‌తోనూ మరో సినిమా చేయాలని ఫ్యాన్స్‌ నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థగ్‌ లైఫ్‌ తర్వాత మణిరత్నం-రజనీతో సినిమా చేయనున్నాడని ప్రచారం గట్టి జరుగుతుంది. మరి ఈ హిట్‌ కాంబో మరో మూవీ సెట్‌ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేయిట్‌ చేయాల్సిందే.

Exit mobile version