Site icon Prime9

Manik Rao Thackrey: కంటివెలుగుకు రూ.300 కోట్లు ఖర్చు.. ఒక్క కంటి ఆస్పత్రి అయినా కట్టారా?- మాణిక్ రావు థాక్రే

manikrao

manikrao

Manik Rao Thackrey: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు.
గాంధీ భవన్ లో నేడు ఆయన టీపీసీసీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని అన్నారు. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు.
అధిష్ఠానం ఏం చెబితే అది చేయడమే తన విధి అని చెప్పుకొచ్చారు. భారత్‌ జోడో యాత్ర మాదిరిగానే హాథ్‌సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

ఎముకలు కొరికే చలిలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి యాత్ర లక్ష్యాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలంతా ఐక్యంగా హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy ) 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తుండగా.. మిగతా సీనియర్లు కనీసం 20 నుంచి 30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలని తెలిపారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ఈ యాత్రలో ఒకరోజు.. ప్రియాంక లేదా సోనియాగాంధీ పాల్గొననున్నట్లు సమాచారం.

ఇక బీఆర్ఎస్ పార్టీపై మాణిక్ రావు ఠాక్రే పలు విమర్శలు చేశారు. కంటి వెలుగు పథకం గురించి గొప్పగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు.

మెుదటి విడతలో రూ. 100 కోట్లు పెట్టి కొన్న యంత్రాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

కంటి వెలుగు కు కేటాయించిన 200కోట్ల బడ్జెట్ లో 50 కోట్లు ప్రచారానికే ఖర్చు చేస్తున్నారు.

రూ. 150 కోట్లలో మనిషి మీద మీరు ఖర్చు పెట్టేది కేవలం 35 రూపాయలు మాత్రమే.

కళ్ళు కనిపించిన.. కనిపించకున్న కేసిఆర్ బొమ్మ ఉన్న కళ్లద్దాలు ఇస్తున్నారు.

టెండర్లు పిలవకుండా బీఆర్ఎస్ నేతలకే కాంట్రాక్టులు.

కంటి వెలుగు యాడ్ లు ఆఫ్గనిస్తాన్ లో కూడా వేసుకున్నారు.

దీని కొరకు ఒక్క డాక్టర్ ను అయిన నియమించారా? అని ప్రశ్నించిన ఠాక్రే.

లక్షన్నర మిషన్ ను రెండున్నర లక్షలకు కొని మోసం చేస్తున్నారు.

సరోజినీ ఆసుపత్రిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఠాక్రే విమర్శ.

విద్య, వైద్యంను కేసీఆర్ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు.

వరంగల్ రీజినల్ కంటి ఆసుపత్రిలో కేవలం కటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పర్మినెంట్ డాక్టర్లను నియమించాలని డిమాండ్.

రాష్ట్రంలో మెడికల్ మాఫియా నడుస్తున్న చర్యలు తీసుకోరా అని ప్రశ్న.

ఒక్క ఛాన్స్ అంటూ.. వెయ్యి ఏళ్లకు సరిపడా సంపాదించుకుంటున్నారు.

అవినీతి ఉన్న నలుగురు నేతలు ఖమ్మంలోనే ఉన్నారని ఘాటు విమర్శలు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version