Site icon Prime9

Manchu Lakshmi : మరోసారి మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మీ..

manchu lakshmi kind gesture towards government schools

manchu lakshmi kind gesture towards government schools

Manchu Lakshmi : తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి వెండితెరపైకి రాకముందే బుల్లితెరలో పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ మరోసారి తన మంచి మనసు చాటుకుందని తెలుస్తుంది.

ఇటీవలే బుధవారం మంచు లక్ష్మీ జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిశారు. ఆమెతో చాలాసేపు చర్చించిన మంచు లక్ష్మీ.. ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ధనవంతుల పిల్లలతో పాటు.. పోటీపడుతూ.. పేద విదార్ధులు కూడా పోటీపడి చదవాలన్నారు లక్ష్మీ ప్రసన్న. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించి.. ప్రైవేట్‌ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్‌ భాషలో రాయడం, చదవం, రావాలని కోరారు. ఇదే లక్ష్యంతో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంచు లక్ష్మీ తెలిపారు. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి ఈ జిల్లా నుంచి మంచి విదార్ధులను తయారా చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఇక తమ సంస్థ ఆధ్వర్యంలో గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని 56 పాఠశాలల్లో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమం అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దాని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ ఏటా కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. దాని వల్ల వారి విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు మంచు లక్ష్మీ. ఈసారి 30 స్కూల్స్ ను జోగుళాంబ గద్వాల్ జిల్లా నుంచి సెలక్ట్ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యా బోధన మూడు స్థాయిల్లో జరుగుతుందని అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను ఎంపిక చేశామని, వాటిలో టీవీ, వాల్‌పేయింటింగ్‌, కార్పెట్స్‌, బోధన సామగ్రి సమకూరుస్తామన్నారు. 30 పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకం చేశారు.

Exit mobile version