Site icon Prime9

Manchu Lakshmi : నీకేంట్రా నొప్పి? నువ్వేమన్నా ఇస్తున్నావా డబ్బులు?? అంటూ ఫైర్ అవుతున్న మంచు లక్ష్మి.. ఎందుకంటే ?

manchi lakshmi fires on negative comments and video got viral

manchi lakshmi fires on negative comments and video got viral

Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా.. మంచు లక్ష్మీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. కేవలం నటించడమే కాకుండా ఇటీవల నిర్మాతగా కూడ మారింది. అలాగే బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం వంశీకృష్ణ దర్శకత్వం వహించిన “అగ్ని నక్షత్రం” అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ .. ఆ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇక మంచు లక్ష్మి తన ట్వీట్స్ తో, స్పీచ్ లతోనో, ఇంటర్వ్యూలతో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటారు. ఇటీవలే ఏపీ పాలిటిక్స్ పై ట్వీట్ చేసి వైరల్ అయిన మంచు లక్ష్మి తాజాగా మరో వీడియోతో వైరల్ అవుతుంది. అందుకు కారణం ఆమె పోస్ట్ చేసిన వీడియో అని తెలుస్తుంది. సదరు వీడియోపై పలువురు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేయడంతో.. నీకెంట్రా నొప్పి అంటూ లక్ష్మి నెక్స్ట్ లెవెల్లో కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు మరో వీడియోని రిలీజ్ చేసింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా మంచు లక్ష్మి (Manchu Lakshmi) విమానాశ్రయంలో కార్పెట్ శుభ్రంగా లేదని.. చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో.. ఐ ఫోన్ తో వీడియో తీశాను కాబట్టి ఇంకా క్లారిటీగా వచ్చింది రాసుకొచ్చింది. అయితే ఈ వీడియో పట్ల నెటిజన్లు మిశ్రమంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారిలో పలువురు మాత్రం నెగిటిక్ కామెంట్స్ చేశారు. నువ్వు ఐ ఫోన్ వాడుతున్నావా? బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తావా ? అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మంచు లక్ష్మి ఆ కామెంట్స్ చేసిన వారిపై రియాక్ట్ అవుతూ మరో వీడియోని తాజాగా పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేనేదో వీడియో పెడితే దానికి మీరు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడతారు. నేను ఐ ఫోన్ వాడకూడదా? నేను బిజినెస్ క్లాస్ లలో తిరగకూడదా? నీకేంట్రా నొప్పి? నువ్వేమన్నా ఇస్తున్నావా డబ్బులు? నువ్వేమన్నా కొనిచ్చావా? నా సంపాదన నా ఇష్టం.. అంటూ ఏకిపారేసింది. ఒక మహిళ ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు, ఏం పోస్ట్ చేయకూడదు అని అంటే ఎలా అని ప్రశ్నించింది. డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడతాను.. మా అమ్మానాన్నలు నాకు డబ్బులు ఇవ్వరు.. కానీ కష్టపడటం నేర్పించారు అంటూ ఫైర్ అయింది. దీంతో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.

 

 

Exit mobile version