Site icon Prime9

Viral News: ప్రియురాలితో షాపింగ్‌.. భార్యకు చిక్కిన భర్త.. ఆపై ఏం జరిగిందంటే..?

viral news in uttar pradesh

viral news in uttar pradesh

Viral News: క‌ర్వా చౌత్‌.. ఈ పండుగను ఉత్తర, ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఎంతో ఘ‌నంగా నిర్వహించుకుంటారు. తమ భ‌ర్త ఆరోగ్యంగా ఉండాల‌ని మహిళలు ఈ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి పండుగ రోజున ప్రేయసితో భ‌ర్త‌తో షాపింగ్ వెళ్లి భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు. దానితో ఆమె అక్కడే తనను చిత‌క‌బాదింది. ఇందుకు సంబంధించిన ఇప్పుడు ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

తన ప్రియురాలితో షాపింగ్ చేస్తుండగా, భార్య చేతికి చిక్కి అడ్డంగా బుక్కయ్యి భార్య చేతిలో దెబ్బలు తిన్నాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవపడిన భార్య గత కొద్దిరోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కాగా కర్వా చౌత్‌ పండుగ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. అయితే అదే సమయంలో ఆమె భర్త మరో అమ్మాయితో కలిసి షాపింగ్కు వచ్చాడు. కానీ ఏమి తెలియదన్నట్టుగా తన భార్యను చూసి కూడా షాపింగ్ చేస్తున్నాడు. అదీ గమనించిన భార్య అక్కడే భర్తను పట్టుకుని నిలదీసింది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డిన భర్తను అందరి ముందే ఆమె చితకబాదింది. విషయం తెలుసుకున్న తోటి మహిళలు సైతం భర్తను కొట్టారు. దానితో ఆగకుండా ప్రియురాలికి సైతం బుద్ధి చెప్పారు. ఈ ఘటనతో షాపింగ్ క్లాంప్లెక్స్ మొత్తం రద్దీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండి: వారం రోజులపాటు రాజమండ్రి వంతెన మూసినేత

Exit mobile version