Site icon Prime9

Mufasa Trailer: ముఫాసా: ది లయన్ కింగ్ ఫైనల్ ట్రైలర్ చూశారా?

Mufasa: The Lion King Final Telugu Trailer: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గుడ్‌న్యూస్‌ అందించారు. హకునా మటాటా (ఏం ప్రాబ్లమ్‌ లేదు) అంటూ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఇది చూసి ది లయన్‌ కింగ్ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా వరల్డ్‌ వైడ్‌గా ముఫాసా: ది లయన్‌ కింగ్ సినిమాకు మంచి ఆదరణ ఉంది. చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఈ యానిమేటెడ్‌ చిత్రానికి మంచి క్రేజ్‌ ఉంది. హాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో విడుదలైన ఎంతో ప్రేక్షకాదరణ పొందుతుంది. 1994లో వచ్చిన ది లయన్‌ కింగ్‌ అప్పట్లో భారీ విజయం సాధించింది. దానినే 2019లో యానిమేషన్‌ 3Dలో మరోసారి ప్రేక్షకులకు అందించారు. తెలుగులోనూ విడుదలైన మంచి విజయం సాధించింది.

ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’ను తీసుకువస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్‌ కానుంది. ఎందుకంటే ఇందులోని ముఫాసా లయన్‌ కింగ్‌ పాత్రకు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వాయిస్‌ అందించారు. ఇప్పటికే ఆయన వాయిస్‌తో విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్‌ 20న వరల్డ్‌ వైడ్‌గా మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు ఇంకా నెల రోజులే ఉండటంతో మేకర్స్‌ మరో ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. “హకునా.. మటాటా.. ఎంత అద్భుతం ఈ మాట” అంటూ ట్రైలర్‌ మొదలైంది. అందులోని కొన్ని యానిమల్‌కి ఆలీ, బ్రహ్మనందంలు వాయిస్‌ అందించారు. ఇందులో అనాముకుడైన ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడో చూపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. బేరీ జెంకిన్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌లు కీలక పాత్రలో నటించారు.

Exit mobile version