Site icon Prime9

Maharashtra: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్నువ్యాట్ (లీటరుకు వరుసగా రూ.5 మరియు రూ.3 తగ్గించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం తెలిపారు.

గురువారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఇంధన ధరల పెంపుతో నష్టపోయిన సామాన్యులకు ఇది మేలు చేస్తుందని సచివాలయం ‘మంత్రాలయ’లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం షిండే విలేకరులతో అన్నారు. శివసేన-బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

Exit mobile version