Lucky Bhaskar: ఓటీటీలోకి లేటెస్ట్ హిట్‌ మూవీ ‘లక్కీ భాస్కర్‌’ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

  • Written By:
  • Updated On - November 18, 2024 / 01:35 PM IST

Lucky Baskhar OTT release date: దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. అందులో మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్’ కూడా ఒకటి. అన్నిటి కంటే ఈ చిత్రానికి మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సాధారణ బ్యాంక్‌ ఎంప్లాయ్‌ వందకోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా స్టోరీ. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన మూడు వారాలు అవుతున్న ఇప్పటికీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది.

ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా మౌత్‌ టాక్‌తోనే కలెక్షన్లు రాబడుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఫలితం ఆడియన్స్‌ మళ్లీ మళ్లీ థియేటర్లోకి వచ్చిన లక్కీ భాస్కర్‌ చూస్తున్నారు. బాక్సాఫీస ఇంత బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అవుతుంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులో ఉంచేందుకు నెట్‌ప్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుందట.

మొదట లక్కీ భాస్కర్‌ని నవంబర్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే గత వారం రిలీజైన మట్కా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఇక కంగువా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. రిలీజ్‌ ముందు ఈ సినిమాలపై అంచనాలు ఉండటంతో వీటి ప్రభాసం లక్కీ భాస్కర్‌పై పడే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మట్కా ప్లాప్‌ అవ్వడం, కంగువా మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో ఇప్పటికే థియేటర్లో లక్కీ భాస్కర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను మరింత ఆలస్యం అయ్యేలా ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే నవంబర్‌ చివరి వారంలో రావాల్సి లక్కీ భాస్కర్‌.. డిసెంబర్‌లో మొదటి, రెండో వారంకి వాయిదా పడినట్టు గుసగులు వినిపిస్తున్నాయి.

కాదు..  నవంబర్ 30నే  ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే సదరు సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా దుల్కర్‌ సల్మాన్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. హైపర్ ఆది, మానస చౌదరి, సూర్య శ్రీనివాస్ తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వ్యవహరించారు.