Site icon Prime9

Edible Oil Price: తగ్గిన వంటనూనెల ధరలు

Edible Oil Price Dropped: ఐదు వంటనూనెల రిటైల్ ధరలు మస్టర్డ్ ఆయిల్, వనస్పతి, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ గత నెలతో పోలిస్తే 2–8% తగ్గాయి, అయితే ఇప్పటికీ గత ఏడాదికంటే 3–21% ఎక్కువగా ఉన్నాయి.

వీటిలో పామాయిల్ అత్యధికంగా 7.83 శాతం వరకు తగ్గింది, శుక్రవారం కిలోకు రూ.156.02 నుండి రూ.143.81కి తగ్గింది. వనస్పతి రిటైల్ ధరలు కనిష్టంగా 2.01 శాతం తగ్గాయి. కిలో రూ.165.74 నుంచి శుక్రవారం రూ.162.41కి  వనస్పతి తగ్గింది

సోయాబీన్ నూనె సగటు రిటైల్ ధర శుక్రవారం నాడు కిలో రూ. 169.7 నుంచి రూ. 164.43కి అంటే  3.11 శాతం తగ్గింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రిటైల్ ధర రూ. 191.93 కిలోకు రూ. కిలోకు 185.6, 3.30 శాతం తగ్గింది. అయితే గతేడాది ఇదే రోజుతో పోలిస్తే సన్ ఫ్లవర్  రిటైల్ ధర ఇప్పటికీ 12.31% ఎక్కువ.

Exit mobile version
Skip to toolbar