Site icon Prime9

Kakinada News : కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ఏడుగురు మృతి

latest kakinada news about 7 members dies in oil factory

latest kakinada news about 7 members dies in oil factory

Kakinada News : కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు.

పెద్దాపురం మండలం జి. రాగంపేట అంబటి ఆయిల్స్ ఫ్యాక్టరీలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది.

ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రపర్చేందుకు ట్యాంకర్‌లోకి దిగిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ట్యాంకర్‌లో ఊపిరాడకపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

 

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పని చేస్తున్నారని సమాచారం అందింది.

ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైందని.. 15 రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు చెబుతున్నారు.

అయితే నిర్మాణంలో ఉన్న ఆయిల్‌ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.

కాగా, ఇలాంటి ఘటనల్లో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

రెక్కాడితే కాని డొక్కాడని కార్మికుల బతుకులు ఛిద్రమైపోతున్నాయి.

మృతుల వివరాలు..

కుర్రా రామారావు (54)

వెచ్చంగి కృష్ణ (35)

వెచ్చంగి నరసింహ,

వెచ్చంగి సాగర్,

కురతాడు బంజిబాబు.. పాడేరుకి చెందినవారు.

కట్టమూరి జగదీశ్,

ప్రసాద్.. పులిమేరకు చెందిన వారిగా గుర్తించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version