Koratala Siva : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండగా తారక రత్న మరణం, ఆస్కార్ అవార్డుల కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. కాగా ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత, ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, పలువురు నిర్మాతలు సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొరటాల మాట్లాడుతూ..‘‘జనతా గ్యారేజ్’ తర్వాత నా సోదరుడు, ఈ జనరేషన్‌లో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌తో కలిసి మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ మర్చిపోయిన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు లాంటి మనుషులు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్.. భయం ఉండాలి.. భయం అవసరం.. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నాం. నా కెరీర్‌లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నా. ఈ కథ చెప్పిన వెంటనే.. ‘‘ఫైర్‌తో రాశారు సర్’’ అని అనిరుధ్ అన్నాడు. ఇలాంటి టీమ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని కొరటాల శివ వివరించారు.
‘This is going to be my best work ever’ 🔥🔥🔥🔥
Director #KoratalaSiva speech at the #NTR30 Press Meet 💥💥#NTR30Begins 🔥@tarak9999 #JanhviKapoor @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @NTRArtsOfficial pic.twitter.com/Mf0JsROgQB
— Yuvasudha Arts (@YuvasudhaArts) March 23, 2023
ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉండడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా కసరత్తు చేసారని, ఎన్టీఆర్ సలహాతో గ్యాప్ తీసుకుని మరీ మార్పులు, చేర్పులు జరుపుతూనే ఉన్నారని సమాచారం అందుతుంది. మొత్తానికి అద్బుతమైన అవుట్ ఫుట్ వచ్చాకే సినిమా లాంచ్ పెట్టారు ఎన్టీఆర్. కొరటాల శివ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. పైగా ఆచార్య లాంటి పరాజయం తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
అలానే సినిమా ప్రారంభోత్సవంలో అనిరుధ్ మాట్లాడుతూ.. ”ఏడాది క్రితం దర్శకుడు కొరటాల శివ గారిని కలిశా. ఎప్పుడు కలిసినా ఓ మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఊహలో నేను ఓ భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన ఊహ భారీగా ఉంటుంది. ప్రాణం పోయగలనని అనుకుంటున్నా. లెజెండ్స్ తో కలిసి పని చేసే అవకాశం ఈ సినిమాతో లభించింది. మోషన్ పోస్టర్ సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చిన శివ గారికి, తారక్ గారికి థాంక్స్.. నేను తిరిగి వస్తున్నాను” అని చెప్పారు. అంతకు ముందు తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలకు అనిరుధ్ పని చేశాడు.