Site icon Prime9

Keerthy Suresh: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన కీర్తి సురేష్‌ – ముహుర్తం కూడా ఫిక్స్‌, గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్!

Keerthy Suresh Will Marry Her Boyfriend Antony Thattil: హీరోయిన్‌ కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎప్పటిలాగే ఇది ప్రచారం కాదు. ఈసారి కీర్తి పెళ్లి సెట్‌ అయిపోయిందట. ఆమె వివాహ వేదిక, పెళ్లి తేదీలు ఇవేనంటూ ఇండస్ట్రీలో తెగ హడావుడి జరుగుతుందంటూ కోలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదంత చూస్తుంటే ఈసారి కీర్తి పెళ్లి పీటలు ఎక్కడం నిజమే అంటున్నార. కాగా గత కొంతకాలంగా కీర్తి సురేష్‌ పెళ్లిపై తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఆమె బిజినెస్‌ మ్యాన్‌, ఫ్యామిలీ ఫ్రెండ్‌, ఒక దశలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, కీర్తి సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. అవన్ని ప్రచారానికే పరిమితం అయ్యాయి. ఆమె కూడా చాలాసార్లు తన పెళ్లి వార్తలను ఖండించింది. కానీ తాను సింగిల్‌ కాదని మాత్రం హింట్‌ ఇచ్చింది. దీంతో కీర్తి సురేష్‌ రిలేషన్‌ ఉన్నట్టు కన్‌ఫాం అయ్యింది. అయితే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్ధమైందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి అతని పేరు కూడా బయటకు వచ్చింది. కీర్తి సురేష్‌ కొంతకాలంగా తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌తో ప్రేమలో ఉందట. వీరిద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న వీరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారట.

కొన్నేళ్లుగా రిలేషన్‌ ఉన్న వీరిద్దరు ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయం చెప్పారట. వారు కూడా వీరి పెళ్లి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు డిసెంబర్‌లో వీరి పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్‌ అయ్యిందట. డిసెంబర్‌ 11, 12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. త్వరలోనే కీర్తి సురేష్‌ తన పెళ్లిపై స్వయంగా ప్రకటన ఇవ్వనుందని కూడా అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆమె స్పందించేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఈసారి కీర్తి పెళ్లి గురించి గట్టిగా ప్రచారం జరుగుతుండంతో ఆమె ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు.

Exit mobile version