Site icon Prime9

Cm Kcr Comments: గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఈ నెలాఖరులోపు పోడు భూముల పంపిణీ

cm kcr

cm kcr

Cm Kcr Comments: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోడు భూముల గురించి మాట్లాడిన కేసీఆర్.. వారికి గుడ్ న్యూస్ చెప్పారు. దానితో పాటు కొన్నిషరతులు కూడా వివరించారు. ఇక పోడు భూములకు పట్టాలే కాకుండా.. వారికి రైతుబంధు కూడా అందిస్తామని కేసీఆర్ సభాముఖంగా తెలిపారు.

పోడు భూములకు రైతుబంధు..

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎప్పటినుంచో పోరాటం చేస్తున్న పోడు రైతులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. దానితో పాటు కొన్ని షరతులను కూడా కేసీఆర్ వివరించారు. పోడు పట్టాల పంపిణీ అనంతరం.. వారికి రైతుబంధు కూడా అందిస్తామని కేసీఆర్ అన్నారు. పోడు భూములు మావే అని.. వాటిపై సర్వహక్కులు మాకే ఉంటాయి అనడం సరికాదని కేసీఆర్ అన్నారు. అడవులను నరకం అని మాటిస్తేనే.. ప్రభుత్వం పోడు భూములను పంపిణీ చేస్తుందని స్పష్టంచేశారు. కొన్ని ప్రాంతాల్లో పోడు భూములపై గిరిజనులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అడవులను నరుకుతూ.. వాటిపై పూర్తి హక్కులు మావేననటం సరికాదని వివరించారు.

అడవులను కాపాడాల్సిన బాధ్యత గిరిజనులదే..

అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో.. అడవుల్లో నివసించే గిరిజనులు వాటిని కాపాడాల్సిన బాధ్యత అంతే ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా.. అడవుల పునరుజ్జీవన ప్రక్రియ చేస్తున్నామని అందుకు సహకరించాలని కేసిఆర్ CM KCR కోరారు. పోడు భూములపై ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉందని.. వాటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 66లక్షల ఎకరాలు పోడు భూములు ఉన్నాయని.. వీటికి సంబంధఇంచిన నివేదికలు ప్రభుత్వానికి అందాయని కేసీఆర్ అన్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదని.. దానికి మరింత సమసయం పడుతుందని తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చాక.. అడవులను ధ్వంసం చేస్తే ఇచ్చిన పట్టాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు.

హామీ ఇస్తేనే.. పోడు భూములకు పట్టాలు..

పోడు భూములపై కీలక ప్రకటన చేసిన కేసీఆర్.. గిరిజనులకు పలు షరతులు విధించారు. పోడుభూములు సాగు చేసే రైతులు.. ఆ భూముల్ని అడవుల్ని పరిరక్షించాలని తెలిపారు. అడవులను నరకం అని ప్రభుత్వానికి హామీ ఇస్తేనే ప్రభుత్వం పోడు భూములను పంపిణీ చేస్తామని తెలిపారు. ఫారెస్ట్ అధికారులపై దాడులు మానుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. దాడులు చేయటం.. గాయపరచటం.. ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారని ఇలాంటి దాడులు మానుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ పోడు భూముల పంపిణీ అంశాన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలకు కేసీఆర్ సూచించారు. ఈ పంపిణీ కేవలం గిరిజనుల సంక్షేమం కోసమేనని అన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక.. వాటికి రైతుబంధుతో పాటు విద్యుత్ సాగు నీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు. భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామని కేసీఆర్ అన్నారు.

 

సీఎం కేసీఆర్ ప్రకటనతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం.. అలాగే వారికి రైతు బంధు కూడా ఇస్తాం అనడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version