Kcr vs Governer: కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్న ఈ వివాదం.. ఇప్పుడు న్యాయస్థానం దాకా వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఓ వైపు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన బీఆర్ఎస్ నేతలు.. ఏకంగా హై కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. దీంతో ఈ వివాదం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది.
కంటపడితే కనికరిస్తాడామే కానీ వెంటపడితే.. మాత్రం కేసీఆర్ అంత ఈజీగా వదలడని బీఆర్ఎస్ నేతలు అంటుంటారు.
ఈటల రాజేందర్ ఉదంతమే దీనికి ఉదాహరణ. ఇక కేసీఆర్ తో సై అంటే సై అంటున్న గవర్నర్ తోను తేల్చుకునేందుకే కేసీఆర్ రెడీ అవుతున్నారు.
రాజ్ భవన్ తో పెరుగుతున్న దూరం.. న్యాయస్థానం వరకు చేరనుంది. గవర్నర్ తీరుపై నేరుగా హైకోర్టుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నట్లు సమాచారం.
నాలుగు రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టాలని చూస్తోంది.
దీనికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇప్పటివరకు రాజ్ భవన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.
ఇదే సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది. గవర్నర్ ప్రసంగం కాపీ పంపాలని సూచించింది.
దీంతో హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో.. ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.
ఈసారి మరో నాలుగు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలున్నాయి. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం ఈనెల 21న గవర్నర్ కు లేఖ రాసింది.
దానిని గవర్నర్ ఆమోదించలేదు. సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం కాపీ పంపాలంటూ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ పంపింది.
ఇప్పుడు గవర్నర్ ఆమోదంపైనే హైకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
గవర్నర్ ఆమోదం తర్వాత కేబినెట్ ఆమోదించి బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించనుంది. తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
సమయం సమీపిస్తుండడంతో హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనుంది.
సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దుష్యంత్ దవేను రంగంలోకి దించింది.
లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.
గవర్నర్ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ మండలిలో ప్రవేశపెడతారు.
ముసాయిదా బడ్జెట్ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది.
ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీంతో గవర్నర్ తో కేసీఆర్ ఫైట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/