Site icon Prime9

Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”

kantara for oscar nominations

kantara for Oscar nominations

Kantara: రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”(Kantara). చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది. ప్రేక్షకులే కాఉండా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా పై ప్రశంసలు వర్షం కురిపించారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది.

రెండు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్

ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా మరో శిఖరాగ్రానికి అడుగు దూరంలో నిలిచి భారత సినీ ప్రియులను అబ్బురపరిచింది. ఏ భాషలోని సినిమాకి అయిన ఆస్కార్ సాధించడం అనేది గొప్ప విషయంగా భావిస్తారు. తాజాగా ఇండియా నుంచి కాంతారా సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ కి నామినేషన్స్ సాధించి దేశం మరింత గర్వించేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అమెరికాలో వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ హంగామా .. 30 కార్లతో కార్ ర్యాలీ.. | Prime9 News

ఈ సంవత్సరం ఆస్కార్ కు అధికారికంగా గుజరాతి సినిమా చల్లా షోని పంపించారు. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆస్కార్ బరిలో ఉంది. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ వేడుక మార్చ్ 12న జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సారి ఇండియా నుంచి మూడు సినిమాలు బరిలో ఉండగా ఒక్క ఆస్కార్ అయినా సాధించాలి అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి:

Ram Gopal Varma: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Director Bobby: నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్

Shahrukh Khan : డిల్లీ అంజలి ఘటనపై స్పందించిన షారూఖ్ ఖాన్.. కుటుంబానికి అండగా ఉంటానంటూ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar