Kamareddy Master Plan: రాష్ట్రంలో తీవ్ర చర్చంనీయాంశమైన మాస్టర్ ప్లాన్(Kamareddy Master Plan) ప్రక్రియ నిలిచిపోయింది. ప్లాన్ ను రద్దు చేస్తున్నామని మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వెల్లడించారు.
ఈ విషయంపై కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్టు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది.
మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మున్సిపాలిటీల అత్యవసర సమావేశం
రెండు మున్సిపాలిటీలు అత్యవసర సమావేశం చేసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. చైర్మన్ , వైస్ చైర్మన్ తో కలిపి 49 వార్డుల కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు.
మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చేస్తున్నారని .. దానిపై స్పష్టత రావడం కోసం ఈ అత్యవసర సమావేశం అని మున్సిపల్ చైర్మన్ జాహ్నవి తెలిపారు.
తీర్మానం చేసిన డ్రాఫ్టు కాకుండా మరొక మాస్లర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపమన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయన్నారు.
డిజైన్ డెవలప్ మెంట్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్దున్నట్టు తీర్మానించినట్టు ఆమ పేర్కొన్నారు. 60 రోజుల పాటు తీసుకున్న అభ్యంతరాలను కూడా ప్రభుత్వానికి పంపిచామని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతలు పక్షమని.. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు.
ఎందుకీ రగడ
గత డిసెంబర్ 15 న మాస్టర్ ప్లాన్ (Kamareddy Master Plan) ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. కామారెడ్డి ఇండ్రస్టియల్ జోన్ మాస్టర్ ప్లాన్లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన 8 గ్రామాలను చేర్చారు.
ఈ గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. 61.5 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు.
మొత్తం కామారెడ్డి పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు.
పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే గ్రామాల రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు.
దీని వల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనిరావని చెప్పకనే చెప్పడంతో వాటి డిమాండ్ పడిపోయింది. దీంతో ఈ మాస్టర్ ప్లాన్ ను ఆయా గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు.
తమ భూములను ఇచ్చేది లేదని 8 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ల వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళనలు తీవ్రతరం చేశారు.
జనవరి 20 లోపు విలీన గ్రామాల పరిధిలోని కౌన్సిలర్లు రాజీనామా చేయాలని ..లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని రైతులు అల్టిమేటం జారీ చేశారు.
రైతులకు మద్దతుగా విపక్ష పార్టీల కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో మిగిలిన కౌన్సిలర్ల పైనా ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో సమావేశమైన మాస్టర్ ప్లాన్ ముసాయిదా ను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/