Devara Movie OTT Streaming Date Fix: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కని ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ థియేట్రికల్ రన్‌లో ఆడియన్స్‌ని మరింత ఆకట్టుకుంటూ థియేటర్లకి రప్పించింది. అలా దేవర టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొత్తం థియేట్రికల్ రన్‌లో ‘దేవర’ రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలోగా వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అంతా మూవీని ఎగబడి చూశారు. వీకెండ్, దసరా హలీడేస్ కూడా ఉండటంతో సాధారణ, ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మూవీ చూసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మిక్స్‌డ్ టాక్‌తో మొదలైన దేవర చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద కలేక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడుఈ బ్లాక్‌బస్టర్ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతుంది. దేవర డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక దేవర థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో మూవీని ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఎలాగు మూవీ వచ్చిన నెల రోజులు దాటుతున్న క్రమంలో నవంబర్ ఫస్ట్ వీక్ దేవర స్ట్రీమింగ్‌కు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోందట నెట్‌ఫ్లిక్స్. నవంబర్ 8న దేవర ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా ఇవ్వనుందట. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నవంబర్ 8న విడుదల చేయాలని, హిందీ వెర్షన్ కాస్తా ఆలస్యంగా రిలీజ్ చేయనుందట. నవంబర్ 22 నుంచి హిందీ వెర్షన్‌లో అందుబాటులో ఉంచాలని నెట్‌ప్లిక్స్ అభిప్రాయపడుతున్నట్టు టాక్.
మరి నవంబర్ 8న దేవర ఓటీటీలో వస్తుందో? లేదో? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్లో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్ మంచి విజయం సాధించడంలో సెకండ్ పార్ట్ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం ‘వార్ 2’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కాస్తా విరామం తర్వాత దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతికథానాయకుడి పాత్ర పోషించారు.