Site icon Prime9

JC Prabhakar Reddy: పవన్ కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. పేర్ని నానికి కౌంటర్

JC Prabhakar Reddy Strong Counter to Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తాడిపత్రి మా ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికేనా కుటుంబం.. మాకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇం్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుుడ మీకు ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. గతంలో నా కుటుంబంపై అనేక కేసులు పెట్టారని, ఇంట్లో మహిళలపై కూడా కేసులు పెట్టారని అన్నారు.

పేర్ని నానా బాగోతాలన్నీ అందరికీ తెలుసని, మహిళల గురించి అర్హత లేదన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. వైసీపీ పాలనలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను సైతం ఇబ్బంది పెట్టినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు మీపై దయ చూపడంతోనే ఇవాళ మీరు బయట తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు మంచితనంతోనే తమ కార్యకర్తలు మైనంగా ఉన్నారని, చంద్రబాబు లేకపోతే మీ అంతు చూసేవాళ్లమని హెచ్చరించారు. మహిళలను కించపరిచే వైసీపీ నేతలను వదిలేది లేదన్నారు.

వైసీపీ హయాంలో చేసిం మర్చిపోయారా.. చంద్రబాబును అర్థరాత్రి అరెస్ట్ చేసినిప్పుడు ఆయన కుటుంబం కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు చేసింటే నిజాయితీగా ఒప్పుకో.. అంతేకానీ అబద్ధాన్ని కప్పి ఉంచి దాక్కోవడం కాదన్నారు. నిజంగా దమ్ము ఉంటే ధైర్యంగా నిలబడాలని సలహా ఇచ్చారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. రేషన్ బియ్యం స్కామ్‌లో వస్తున్న వార్తుల అవాస్తవమని వివరించారు. స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ ఇంట్లో మహిళపైకి వెళ్లడం సరైందని కాదని చెప్పారు. ఈ వ్యవహారం కేసులో తనను, తన కుమారుడిని అరెస్ట్ చేసుకోవచ్చనన్నారు. కేవలం తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఇంట్లో ఆడవాళ్లను కేసుల పేరిట ఇబ్బందులకు గురిచేప్తున్నట్లు తెలిపారు.

Exit mobile version