Site icon Prime9

Jani Master: జానీ మాస్టర్‌కు ఊరట – బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Jani Master Gets Bail

Jani Master Got Bail From HC: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. తాజాగా తెలంగాణ హైకోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్‌ తనని లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల అతడిపై పోక్సో చట్టం, లైంగిక వేధింపులు కేసు నమోదు చేయగా.. ఈ కేసులో జానీ మాస్టర్‌ అరెస్టై జైలుకు వెళ్లాడు. దీంతో అతడు బెయిల్‌ కోసం ఇప్పటికే పలుసార్లు పటిషన్‌ వేయగా.. కోర్టు తీరస్కరించింది.

ఇటీవల మరోసారి జానీ బెయిల్‌ పటిషన్‌ వేయగా.. తాజాగా కోర్టు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అతడికి రెగ్యూలర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఇటీవల జానీ మాస్టర్‌ నేషనల్‌ అవార్డు తీసుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు 5 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఆ తర్వాత అతడిపై ఫోక్స్‌ చట్టం నమోదవ్వడంతో అవార్డును కమిటీ తాత్కలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత జానీ తన బెయిల్‌ను రద్దు చేసుకుని మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈసారి జానీ తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు మంజూరు చేసింది. గురువారంసాయంత్రం జానీ మాస్టర్‌ బయటకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version