Janasena Leader Nagababu Criticizes CM Jagan: జగన్ సర్కారు పై జనసేన విమర్శల దాడిని పెంచుతోంది. నవరత్నాలపై నవసందేహాలంటూ ప్లీనరీ రోజునే వైసీపీని పవన్ టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమ్మ ఒడి తప్పించుకోవడానికే ముద్దుల మావయ్య స్కూళ్లను మూసివేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. స్కూళ్లను మూసివేయడం ద్వారా భావి భారత పౌరుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన కార్యాలయం లేఖను విడుదల చేసింది.
Nagababu Comments on Jagan: అమ్మ ఒడి తప్పించుకునేందుకే ముద్దుల మావయ్య.. స్కూళ్లను మూసివేస్తున్నారు: నాగబాబు

janasena-leader-nagababu-criticizes-cm-jagan