Site icon Prime9

Jabardast Ramprasad: జబర్దస్త్‌ కమెడియన్‌ రాంప్రసాద్‌కు ప్రమాదం – షూటింగ్‌కి వెళుతుండగా..

Jabardasth Comedian Ram Prasad Met With Accident: జబర్దస్త్‌ కమెడియన్‌ ఆటో రాంప్రసాద్‌ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. గురువారం షూటింగ్‌కి వెళుతున్న అతడి కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఎప్పటిలాగే గురువారం రాంప్రసాద్‌ కారులో షూటింగ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్‌ కారు ముందుకు కారును ఢి కొట్టాడు.

తన ముందు వెళుతున్న కారు సడెన్‌ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాంప్రసాద్‌ కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదం నుంచి త్రటిలో తప్పించుకున్న రాంప్రసాద్‌ చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాంప్రసాద్‌కు ప్రమాదం జరిగినట్టు తెలిసి అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version