Site icon Prime9

Jabardasth Comedian : ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్..

jabardasth comedian hari involved in red sandal smuggling

jabardasth comedian hari involved in red sandal smuggling

Jabardasth Comedian : బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ఈ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుని బ‌య‌ట‌కు వెళ్లి సిల్వ‌ర్ స్క్రీన్ మీద కూడా రాణిస్తున్నారు. అయితే ఈ షో నుంచి ఓ యాక్ట‌ర్ చేసిన ప‌ని మాత్రం అంద‌రినీ షాక్‌కి గురి చేస్తోంది.

అత‌నే హ‌రి అలియాస్ హరిత. జబర్దస్త్ లో లేడి గెటప్ ల ద్వారా బాగా ఫేమస్ అయిన ఇతను ఇప్పుడు ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ కేసులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పుంగ‌నూరులో పోలీసులు రూ. 60 ల‌క్ష‌లు విలువైన ఎర్ర చంద‌నంను సీజ్ చేశారు. ఆదివారం రాత్రి ప‌ద‌కొండు గంట‌ల‌కు పుంగ‌నూరు పోలీసులు ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ గురించి స‌మాచారం వ‌చ్చింది. వారు త‌నిఖీలు చేస్తుండ‌గా పోలీసుల‌ను చూసిన రెండు వాహనాల డ్రైవ‌ర్స్ పారిపోయారు. వారిలో ఒక‌రిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ అక్ర‌మ కేసు త‌ర‌లింపులో హ‌రిబాబు పేరు బ‌య‌ట‌కు రావ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

ఎర్ర చంద‌నం అక్ర‌మ కేసులో హ‌రిబాబు ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఉన్న హ‌రిబాబు ఇప్పుడు ప‌రారీలో ఉన్నాడు. ఇవే కాకుండా త‌న‌పై గతంలో కూడా చాలా కేసులున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. 2021లో చిత్తూరు జిల్లాలోని బాక‌రాపేట ద‌గ్గ‌ర ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా హ‌రిబాబుని పట్టుకోవడానికి యత్నించగా.. అతను  త‌ప్పించుకున్నాడ‌ని సమాచారం అందుతుంది. పోలీసులు హరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.

Exit mobile version