Site icon Prime9

Revanth Reddy Tour: రేవంత్ రెడ్డి పాదయాత్రపై సందిగ్థత.. కారణం ఇదే?

revanth reddy tour

revanth reddy tour

Revanth Reddy Tour: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. అసలు రేవంత్ పాదయాత్ర చేస్తారా.. ఈ యాత్రకు సీనియర్లు సహకరిస్తారా అనే సందిగ్ధత కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతుంది. ఇక రాష్ట్రానికి ఇంచార్జ్ గా వచ్చిన మాణిక్ రావు ఠాక్రే.. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడోయాత్ర చేయాలని సూచించారు.

కాంగ్రెస్ లో కుమ్ములాటలు

రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ ఉత్సహంగా ఉన్నారు. కానీ రేవంత్ కు సహకరించేందుకు చాలమంది సీనియర్ నాయకులు ముందుకు రావడం లేదు. రెండు నెలలు పాదయాత్ర చేయాలని ఠాక్రే సూచించంగా.. ఐదు నెలలు పాదయాత్ర చేసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ యాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే ఈ నెల 26నుంచి పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థతి అయోమయంగా ఉంది.. నేతల్లో సమన్వయం లోపించడం దీనికి ప్రధాన కారణం. పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. ఓ వైపు దేశంలో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతుండగా.. దానికి కొనసాగింపుగా.. రాష్ట్రంలో హాత్‌సే హాత్‌ జోడో యాత్ర చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.

సీనియర్ నేతల అసంతృప్తి

ఇక రేవంత్ పాదయాత్ర ప్రారంభం కాకముందే ఆ పార్టీలో కుమ్ములాటలు మెదలయ్యాయి. ఈ పాదయాత్రలో రేవంత్ ఒక్కరే పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయంపై ఇతర సీనియర్ నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరే పాదయాత్ర చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నేతలు ఈ పాదయాత్రపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు.

ఈ నెల జనవరి 26 నుంచి పాదయాత్రకు రేవంత్ సిద్ధమయ్యారు.

సుమారు ఈ యాత్ర 126 పాటు ఉంటుందని.. కాంగ్రెస్ నేతలు అంచన వేస్తున్నారు.

రోజుకు సగటున 18 కిలో మీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని 99 నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర చేపట్టనున్నారు.

ఈ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్.. ప్రముఖ ఆలయం నుంచి ప్రారంభించాలని అనుకున్నారట.

అందుకే ప్రముఖ ఆలయాన్ని పాదయాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం.

ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే?

మెుదట్లో గద్వాల ఆలయాన్ని అనుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత భద్రాచలం ఆలయాన్ని పాదయాత్ర ప్రారంభానికి ఎన్నుకున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహాకారం అందడం లేదని.. అందుకే ఇక్కడి నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిసింది. ఇదివరకే ఈ యాత్ర గురించి అధిష్టానానికి కాంగ్రెస్ నేతలు సమాచారం ఇచ్చారట.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar