IND vs NZ 1st t20: మెుదటి టి20లో టీమిండియా బోల్తా పడింది. కివీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తయడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు బౌలింగ్ లో కూడా విఫలమైంది. కివీస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తారనుకుంటే.. చివర్లో అర్షదీప్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
వన్డే సిరీస్ తర్వాత ఉత్సాహంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్య సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో (IND vs NZ 1st t20) న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ సుందర్ అర్ధసెంచరీ.. సూర్య కుమార్ బ్యాటింగ్ మినహా ఎవరు పెద్దగా రాణించలేదు. ఇటు బౌలర్లు, బ్యాటర్లు విఫలం కావడంతో కివీస్ సునాయసంగా మ్యాచ్ గెలిచింది.
రాంచీ మైదానం బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
కివీస్ కు తక్కువ స్కోర్ కే పరిమితం చేసుంటే.. పరిస్థితి మరోలా ఉండేది.
చివరి ఓవర్లో అర్షదీప్ ఏకంగా 27 పరుగలు సమర్పించుకున్నాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపింది.
చివరి ఓవర్ అర్షదీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది.
రాంచీ మైదానంలో రెండో బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువసార్లు గెలిచేది. కానీ దీనికి భిన్నంగా నిన్నటి మ్యాచ్ జరిగింది.
మ్యాచ్ అనంతరం ఓటమిపై హర్దిక్ పాండ్యా స్పందించాడు.
పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారుతుందని ఊహించలేదని చెప్పాడు.
కివీస్ ఆటగాళ్లు ఈ మ్యాచులో ఉత్తమ ప్రతిభ కనబరిచారని హర్దిక్ అన్నాడు.
ఛేదనలో త్వరగా వికెట్లను పడిన.. గెలుపుపై నమ్మకం ఉందని పాండ్యా అన్నాడు. ఈ పిచ్ పై 177 పరుగులు ఇవ్వడం సరైనది కాదన్నాడు.
చివరి ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పిందని పేర్కొన్నారు. అదనంగా పరుగులు ఇవ్వడం వల్లే ఓడిపోయామని తెలిపారు.
ఈ మ్యాచులో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచాడు.
మిగతా రెండు మ్యాచుల్లో కలసికట్టుగా పోరాడుతామని ఈ సందర్భంగా పాండ్యా అన్నారు.
ఈ మ్యాచులో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మ్యాచ్ లో అర్షదీప్ IND vs NZ 1st T20 ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. చివరి ఓవర్ తొలి బంతికి నో బాల్ వేసిన అర్షదీప్.. టీ20ల్లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు.
ఇప్పటివరకు 14 నో బాల్స్ వేశాడు.. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ 11 నో బాల్స్ తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/