Site icon Prime9

AAP : జాతీయ పార్టీగా ఆప్… కేజ్రీవాల్ రియాక్షన్ ఏంటంటే ?

interrsting details about aap turned into national party

interrsting details about aap turned into national party

AAP: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26 న స్థాపించబడింది. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజా పోరాటం నుంచి ఈ పార్టీ పుట్టిందని చెప్పొచ్చు. ఈ పోరాటాన్ని కేజ్రివాల్ రాజకీయ పార్టీగా కొనసాగించాలని ప్రతిపాదించగా, ఈ పోరాటానికి నాయకత్వం వహించిన అన్నా హజారే వ్యతిరేకించారు. కానీ కేజ్రీవాల్ 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

కాగా అనంతరం 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు అయిన ఆప్ ని కేజ్రీవాల్ తనదైన శైలిలో అభివృద్ది చెందిస్తున్నారు. మొదట ఢిల్లీలో ఆప్ జెండా ఎగరవేయగా ఆ తర్వాత పంజాబ్ లో విజయ డంకా మోగించింది. ఇక ఈ మధ్యే గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉండడంతో ఈ ఎన్నికల ఫలితాల గురించి ఆప్ అభిమనులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు గుజరాత్ లో లేదా హిమాచల్ లో గానీ ఏదో ఒక చోట 6 శాతం ఓట్లు దాటితే ఆప్ జాతీయ పార్టీకి అర్హత సాధిస్తుంది. అంటే గుజరాత్ లో కనీసం రెండు సీట్లు గెలిచినా ఆప్ కల నెరవేరినట్టే. అదే గనక జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిదో జాతీయ పార్టీగా నిలవడంతో పాటు… ఈవీఎం మెషీన్లలో అక్షరాల వరుస క్రమం రీత్యా మొదటి స్థానంలో ఉండనుంది. కాగా ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఇప్పటి వరకు బీజేపీ తిరుగులేని లీడింగ్ తో దూసుకుపోతుండగా… ఆప్ 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా… ఆప్ ఒక్క స్థానంలోనూ లీడింగ్ లో లేకపోవడం గమనార్హం.

దీంతో ఇక ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ ఓడిపోయినప్పటికీ … జాతీయ పార్టీగా మారనుండడం కొంత ఊరటని ఇచ్చే విషయం అని చెప్పాలి. 2024 ఎన్నికలలో ఆప్ బరిలో దిగడానికి ఇది బాగా కలిసొచ్చే అంశం. ఇప్పుడు తాజాగా ఏఎన్ఐ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ… 10 ఏళ్ల క్రితం ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆప్ ని ఆదరిస్తున్న ప్రజలకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం ఆప్ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Exit mobile version