Site icon Prime9

Suriya 42 : ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే గుడ్ న్యూస్ ఇచ్చిన సూర్య.. ఈసారి ఏకంగా 10 భాషల్లో #Suriya42

interesting update about suriya 42 film got viral

interesting update about suriya 42 film got viral

Suriya 42 : ప్రముఖ తమిళ నటుడు సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గజిని, సింగం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ (పాన్ ఇండియా) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను ఏప్రిల్ 16న ఉదయం 9.05 గంటలకు చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ అప్డేట్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తుండగా.. ఇందులో సూర్య యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోండగా..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా.. 3D ఫార్మాట్‌ లోనూ రిలీజ్ చేయనున్నారు.

 

 

అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సూర్య తన ఫ్యామిలీతో సహా ముంబైకి షిఫ్ట్ అవుతున్నారనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ముంబైలో రూ. 70 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారని,. సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే గేటెడ్ కమ్యూనిటీలోనే ఈ ఫ్లాట్ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఫ్లాట్ దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని.. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, సూర్య కొనుగోలు చేశారని చెప్పుకుంటున్న రూ.70 కోట్ల ఫ్లాట్‌లో గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్‌, స్విమ్మింగ్ పూల్, జిమ్. లైబ్రరీ, థియేటర్ ఇలా అన్ని ఆధునిక హంగులు కలిగి ఉన్నాయట. ఆ ఫ్లాట్ అసలు ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్‌మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version
Skip to toolbar