Site icon Prime9

Tamannah – Vijay Varma : విజయ్ తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా.. నా హ్యాప్పీ ప్లేస్ అంటూ !

interesting details about tamannah - vijay varma relationship

interesting details about tamannah - vijay varma relationship

Tamannah – Vijay Varma : భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది స్టార్ హీరోయిన్.. మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ తన అందం, అభినయంతో వరుస ఛాన్స్ లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఈ భామ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ – తమన్నా కలిసి పార్టీలకు వెళ్లడం, కలిసి ఈవెంట్స్ లో పాల్గొనడం ఇటీవల గమనించవచ్చు.

గోవాలో వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ కిస్ చేసుకున్న వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి వీరి జంట గురించి మీడియా కోడై కూస్తుంది. ఈ తరుణంలోనే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ నుంచి లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా, విజయ్ వర్మ జంటగా నటించారు. అలానే వీరి మధ్య హాట్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని షురూ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మొదటిసారి తమన్నా విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి నోరువిప్పింది. దీంతో ఇప్పుడు ఈ వార్త ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

తమన్నా మాట్లాడుతూ.. మన కో యాక్టర్స్ అయినంత మాత్రాన వాళ్లకి అట్రాక్ట్ అయిపోము. అలా అనుకుంటే ఇప్పటివరకు నేను చాలా మంది కో యాక్టర్స్ తో కలిసి పనిచేశాను. పర్సనల్ గా మనకు డిఫరెంట్, సంథింగ్ స్పెషల్ అనిపించాలి అని చెప్పింది. లస్ట్ స్టోరీస్ టైంలోనే మీ ఇద్దరు క్లోజ్ అయ్యారా అని అడగగా.. అవును, నేను ఎదురు చూస్తున్న వ్యక్తి ఇతనే. నేను ఆర్టిఫీషియల్ గా కాకుండా చాలా సహజంగా కలవాలనున్నాను. ఇతన్ని అలాగే కలిశాను. అతను నాకు రక్షణగా నిలబడ్డాడు.

సాధారణంగా ఇక్కడ మన ఎవర్ని అయినా లైఫ్ పార్ట్నర్ చేసుకుంటే వారి కోసం చాలా మారాలి. ఫిజికల్ గా, మెంటల్ గా చాలా మార్చుకోవాలి. కానీ సక్సెస్ చూసిన అమ్మాయిలు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళను అర్ధం చేసుకొని, వారికి అండగా నిలబడే వాళ్ళు రావాలనుకుంటారు. నేను కూడా నా ప్రపంచాన్ని అర్ధం చేసుకునే వాళ్లే రావాలనుకున్నాను. అతను ప్రస్తుతానికి నా హ్యాపీ ప్లేస్ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా మారాయి.

Exit mobile version