Oscar Awards : సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలను సర్వం సిద్దమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ఏడాది జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఈసారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఉండటం.. ఆస్కార్ వేదికపై మన తెలుగు సింగర్ల పెర్ఫామెన్స్ లు కూడా ఉండటంతో ఆస్కార్ వేడుకలపై ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.
62 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆ విషయంలో మార్పు (Oscar Awards)..
మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక పైనే ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక మార్చి 12న జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వస్తారు. కాగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. రెడ్ కార్పెట్ పై పోజులు ఇవ్వడానికి ప్రత్యేకమైన డిజైన్ వేర్ తో మెరిసిపోతుంటారు. అయితే ఈ ఏడాది ఈ కార్పెట్ రంగు మార్చుకోబోతుంది. రెడ్ కార్పెట్ కాస్త షాంపైన్ రంగులోకి మారిపోయింది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించలేదు. ఆస్కార్ లో రెడ్ కార్పెట్ సంప్రదాయం 1961 నుంచి మొదలైంది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ఈ ట్రెడిషన్ ఫాలో అవుతూనే వచ్చింది అకాడమీ. కానీ ఈ ఏడాది తన 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేస్తూ.. అతిథులు కోసం రెడ్ బదులు షాంపైన్ కార్పెట్ పరుస్తుంది. మరి ఈ షాంపైన్ కార్పెట్ పై తారల అందాలు ఎంతలా మెరబోతున్నాయో చూడాలి.
(Oscar Awards) నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్..
హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్స్ లో జరగనున్న ఈ ఆస్కార్ వేడుకలకు అకాడమీ భారీ ఏర్పాట్లు చేసింది. జిమ్మీ కిమ్మెల్ మూడోసారి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక మరోవైపు ఇటీవల ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఆస్కార్ స్టేజి పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కచ్చితమైన ప్రాక్టీస్ అవసరం. కానీ మాకు రిహార్సల్స్ చేయడానికి సమయం కుదరలేదు అంటూ తెలిపాడు. తాము పర్ఫార్మ్ చేయడం లేదని తేల్చి చెప్పేశాడు. అమెరికన్ డాన్సర్ అయిన ‘లారెన్ గోట్లిబ్’ ఆస్కార్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందట. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా తెలియజేసింది. ఈ మేరకు ఆ పోస్ట్ లో.. నేను ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్(Natu Natu Song) ప్రదర్శన ఇస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/