Site icon Prime9

Ilayaraja: గుడిలో అవమానం – స్పందించిన ఇళయరాజా, ఏమన్నారంటే..

Ilayaraja About Temple Incident: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఓ గుడిలో అవమానం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గుడి సంఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. కాగా సోమవారం నుంచి మార్గశిర మాసం మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని ఆండాళ్, రంగమన్నారన్‌ను దర్శించుకున్నారు.

ఈ క్రమంలో ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపం లోపలికి వెళ్లేందుకు యత్నించగా అక్కడే ఉన్న జీయర్‌ ఆయనను అడ్డుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్‌ కావడంలో ఆలయ సిబ్బంది తీరుపై అభ్యంతరకం వ్యక్తం చేశారు. సంగీత విద్వాంసుడైన దేవాలయానికి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడ గర్భగుడిలోకి దర్శనానికి ఇళయరాజాను అక్కడ ఉన్న జీయర్‌ అడ్డుకున్నారు. దీంతో ఆయన బయటే పూజ చేయించుకుని వెళ్లిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వైరల్‌ వీడియోపై ఆయన అభిమానులు స్పందిస్తూ ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగీతంలో ఎనలేని సేవలు అందించిన ఈ మ్యూజిక్‌ మ్యాస్ట్రోకి దక్కింది ఇలాంటి గౌరవమా? తన పాటలతో స్వామిని కీర్తించిన ఈ సంగిత విద్యాంసుడి ఇంతటి అవమానమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. అంతేకాదు దీనిపై నెట్టింట తెగ చర్చ కూడా జరిగింది. ఇది కాస్తా ఇళయరాజా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై ఆయన అసహన వ్యక్తంచేశారు.

“కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో ఎక్కడా, ఏ సమయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. అసలు అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వదంతులను అభిమానులు, ప్రజలు నమ్మొద్దుశ” అంటూ వైరల్‌ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. కాగా సోమవారం శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన సడగోప రామానుజ అయ్యర్, సడగోప రామానుజ జీయర్‌లతో కలిసి ఇళయరాజా పూజలో పాల్గొన్నారు. అలాగే ఈ శుభ సందర్భంగా ఇళయరాజా స్వరపరిచిన ‘దివ్య పాసురం’ని విడుదల చేయడానికి ఆలయానికి వెళ్లారని తెలుస్తోంది.

Exit mobile version