Site icon Prime9

Uttarandhra: ఉత్తరాంధ్రలో రాజధాని రైతుల పర్యటనను అడ్డుకొంటా…ఎమ్మెల్సీ

I will block the visit of capital farmers in Uttarandhra

I will block the visit of capital farmers in Uttarandhra

Mlc Divvada Srinivas: అరసవల్లిలోని సూర్య భగవాన్ స్వామిని దర్శించుకొనేందుకు వస్తే ఇబ్బంది లేదుగాని కాని అమరావతిని మాత్రమే రాజధాని ఉంచాలి, ఉండాలని చేపడుతున్న రాజధాని రైతుల మహా పాద యాత్రను ఖచ్ఛితంగా అడ్డుకొంటానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. రోడ్డుకు అడ్డంగా పడుకొంటామని, మా గుండెలపైనుండి దాటుకొని వెళ్లాలంటూ ఆయన హెచ్చరించారు. ఖరీదైన వాహనాల్లో, లక్షలకు లక్షల ధరలతో కొనుగోలు చేసిన వస్తువులను ధరించి పాదయాత్రను చేపడుతున్నవారా రైతులు అంటూ విమర్శించారు.పెయిడ్ యాత్రగా అభివర్ణించారు.  ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడద్దని ఘాటుగా మాట్లాడారు. పాదయాత్రలో పాల్గొన్న వారి రైతుల ఆధార్ కార్డులు పరిశీలించాలని, అప్పుడు వారి పేరు మీద ఎంతమేర భూమి ఉందో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ఉత్తర్వులతోనే అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్రను ఎమ్మెల్సీ మరిచిన్నట్లుగా మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్దతిలో సాగుతున్న ఉద్యమ పాదయాత్రపై తొలి నుండి అధికార వైకాపా మంత్రులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ మరో అడుగు ముందుకేసి రైతుల పాదయాత్రపై చేసిన వ్యాఖ్యాలపై పోలీసులు ఏమంటారో వేచిచేడాలి. మొత్తం మీద రాజధాని పాద యాత్రను ఏదో విధంగా అడ్డుకొనేందుకు వైకాపా శ్రేణులు నానా తంటాలు పడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar