Hyderabad Metro: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు పలు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్‌ను అకస్మాతుగా ఇర్రంమంజిల్‌లో నిలిపివేశారు. ప్యాసింజర్లందరినీ దింపేసి మరో ట్రైన్‌లో పంపించేందుకు మెట్రో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతా జరగడానికి కారణం ఏంటంని ఆరా తీస్తే సాంకేతిక లోపంతో మెట్రో రైల్(Hyderabad Metro)ఆగిపోయినట్లు సమాచారం.
ఇలా మెట్రో రైల్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పలు మార్గాల్లో వెళ్లాల్సిన మెట్రో ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇర్రంమంజిల్ ఒక్కసారిగా మెట్రో ట్రైన్ ఆగిపోవడంతో.. ఆ రూట్ నుంటి రాకపోకలు జరిపే మిగతా మెట్రోట్రైన్లు కూడా నిలిచిపోయాయి. దానితో విద్యార్థులు, ఉద్యోగులు సహా ప్రయాణికులంతా తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్‌లో టెక్నికల్ ప్రాబ్లంస్ వల్ల మెట్రో సేవలకు ఆటంకం ఏర్పడడం ఇదేం తొలిసారి కాదు.
ఇదేం తొలిసారి కాదంటూ ప్రయాణికుల ఆగ్రహం..
గతంలో కూడా అనేకసార్లు ఇలా ట్రైన్లు ఆగిపోయాయి. భాగ్యనగరంలోని ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా మెట్రో ట్రైన్ల ద్వారా రోజూ వేల మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు.
అందులోనూ ఎల్బీనగర్-మియాపూర్ రూట్స్ లో అయితే ప్రయాణికుల ఎక్కువగా జర్నీ చేస్తుంటారు.
ఆ మార్గంలోనే ఇలా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మెట్రో రైల్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యామ్నాయ ప్రయాణాలు
మరి ఇలా జరగడం వెనుక కారణాలపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంది.
మెట్రోలు ఆగిపోవడంతో ప్రయాణాలకు ఆలస్యం అవుతుందని భావించిన కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకున్నారు.
కొందరు బస్సులపై ప్రయాణాలను కొనసాగిస్తే మరికొందరు మెట్రో ప్రయాణికులు ర్యాపిడో, క్యాబ్స్, ఇలా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
మెట్రో టిక్కెట్ల రేట్లను కూడా పెంచేందుకు ఇటీవలె మెట్రో యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణను కూడా చేపట్టింది.
50రూపాయలుగా ఉన్న టిక్కెట్ రేటును రూ. 60 చేస్తామని మెట్రో ప్రతిపాదించింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/