Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గ్రీక్ గాడ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకి పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. సినీ కెరీర్ ఫామ్ లో ఉన్న హృతిక్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రం పలు వార్తలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరలవుతున్నాయి. 2014 లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసకున్నారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. వీరిద్దరు కలిసి ఇటీవల పలు ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. వీరిద్దరి రిలేషన్ షిప్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వీరి ప్రేమ గురించి రూమర్స్ మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సావానికి తన ప్రియురాలితో కలిసి పాల్గొన్నారు హృతిక్. అయితే ఆ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు.
అతని పోస్ట్ తోనే రివీల్ అయిన సీక్రెట్ (Hrithik Roshan)..
తాజాగా ముంబైలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అయితే ఫస్ట్ పిక్‌లో సబా ఆజాద్.. అమిత్‌తో కలిసి కెమెరాకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా రెడ్ కలర్ ఫ్యూజన్ ఫ్రాక్ ధరించిన సబా.. అమిత్ భుజంపై చెయ్యేసి క్లోజ్‌గా దిగిన పిక్‌లో కాళ్లకు చెప్పులు ధరించలేదు. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్‌లో హృతిక్ మరొకరితో మాట్లాడుతూ కనిపించగా.. అతని చేతుల్లో సబా హీల్స్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అంత పెద్ద స్టార్ హీరో తన ప్రియురాలు సబా హీల్స్ ను పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, హృతిక్, సబా.. గతేడాది ఫిబ్రవరిలో డిన్నర్ డేట్‌లో కనిపించిన తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ గురించి నెట్టింట రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా తను హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్ పార్టీలో కనిపించింది. అంతేకాదు గతేడాది మే నెలలో జరిగిన కరణ్ జోహార్ 50వ బర్త్‌డే వేడుకలో వీళ్లిద్దరూ చేతిలో చెయ్యేసుకుని నడిచి తమ రిలేషన్‌షిప్ గురించి చెప్పకనే చెప్పారు. ఇటీవల ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన రెండు ప్లాట్లను కొనుగోలు చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇటీవల హృతిక్ ఫ్యామిలీతో గెట్ టుగెదర్, కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలో జంటగా కనిపించి తమ ప్రేమను కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం హృతిక్ ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే, హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్న విషయం తెలిసిందే.