Site icon Prime9

Honey Singh: దుబాయ్‌లో స్నేహితులతో పార్టీ – ఒక్క రాత్రికే రూ. 38 లక్షల బిల్లు కట్టాను

Honey Singh Said He Spending Rs 38 Lakhs in Party: పాప్ సింగర్‌ హనీ సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఇంటర్నేషనల్‌ విలేజర్‌’ మ్యూజిక్ అల్భం ద్వారా ఒక్కసారి సెన్సేషన్‌ అయ్యారు. యే యే హనీ సింగ్ ఫుల్‌ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య హనీ సింగ్‌ పాటలకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా పాటలు కంపోజ్‌ చేస్తూనే కెరీర్‌ని నెట్టుకొస్తున్నాడు. మరోవైపు నటుడిగాను రాణిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా హనీ సింగ్‌ మాట్లాడుతూ.. తనకు ఒక దురలవాటు ఉందన్నాడు. చేతిలో డబ్బులు ఉంటే చాలా మంది దుబార ఖర్చులు చేస్తుంటారు. నేను కూడా అలానే ఖర్చు చేసేవాడిని. ఒకసారి రెస్టారెంట్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చి ఏకంగా రూ. 38 లక్షల బిల్లు కట్టానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. “2013లో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి దుబాయ్‌లోని క్లబ్‌లో పార్టీ చేసుకున్నాం. అప్పుట్లో దుబాయ్‌ చాలా కాస్ట్లీ. అక్కడ ఉండాలంటే చాలా డబ్బులు వెచ్చించాలి. కానీ ఇప్పుడలా లేదులేండి. అయితే అప్పట్లో ఫ్రెండ్స్‌ అందరం కలిసి క్లబ్‌లో కూర్చోని ఫుల్‌గా తాగం.

అదే టైంలో మా టెబుల్ దగ్గరికి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. వారు కూడా మాతో జాయిన్‌ అయ్యారు. మొత్తం 23 మంది అమ్మాయిలు మాతో పాటు పార్టీలో ఉన్నారు. దీంతో అందరం ఫుల్‌గా పార్టీ చేసుకున్నాం. చివరికి బిల్లు కట్టడానికి వెళితే పెద్ద షాక్‌ తగిలింది. మా అందరికి కలిపి బిల్లు మొత్తం రూ. 38 లక్షలు అయ్యింది. ఆ బిల్లు నేనొక్కడినే కట్టాను. ఇందుకోసం మూడు క్రిడిట్‌ కార్డులు వాడాల్సి వచ్చింది. ఒక్క రాత్రికే రూ. 38 లక్షలు కట్టి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాను” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం హనీ సింగ్‌ మీర్జా, తు మేరా 22 మై తేరా 22 వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ మధ్యే గ్లోరీ అనే అల్భమ్‌ రిలీజ్‌ చేశాడు.

Exit mobile version