Site icon Prime9

Himachal Pradesh Rains: ఇళ్లలోనే ఉండండి.. ప్రజలకు సీఎం హెచ్చరిక

Himachal pradesh Rains

Himachal pradesh Rains

Himachal Pradesh Rains: ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. దిల్లీలో 41 ఏళ్ల గరిష్ట స్థాయికి వర్షపాతం నమోదయ్యింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల ధాటికి పలు కాలనీలు నీటమునిగియాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులు కురుస్తున్న అతి భారీ వర్షాలకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. 1100, 1070, 1077ల నంబర్లతో మూడు హెల్ప్ లైన్ లను ప్రారంభించామని ఆయన ప్రజలకు చెప్పారు.

ఎళ్లవేళలా అందుబాటులోనే ఉంటా(Himachal Pradesh Rains)

ప్రజలకు ఎలాంటి కష్టం ఎదురైన ఈ మూడు హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. తాను సహాయం చేయడానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానని, ప్రజలు ఈ విపత్తు సమయంలో ఈ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు వారివారి నియోజకవర్గాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘‘దయచేసి ఈ విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయండి, వారి నష్టాలకు పరిహారం అందేలా చూడండి’’ అని సీఏం సుఖు ఎమ్మెల్యేలను కోరారు.

ఈ వరదల వల్ల ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారని, మరికొందరు వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారని అధికారులు చెప్తున్నారు. గల్లంతైన వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు విపత్తు రెస్పాన్స్ బలగాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇకపోతే భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదల యొక్క భయానక దృశ్యాలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. మనాలి, కులు, కిన్నైర్, చంబా ప్రాంతాలు వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ గండం గట్టెక్కించు భగవంతుడా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version