Site icon Prime9

Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్

High tension in thadi patri

High tension in thadi patri

JC Divakar Reddy: అధికారంలో ఉన్న వారికి ఓ న్యాయం.. సామాన్యుడికో న్యాయం.. ఇలా తగలబడింది ఏపీ ప్రభుత్వ పనితీరు. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం ఉందంటూ గుంటూరులో గాన గంధర్వుడి విగ్రహాన్ని అక్కడి పురపాలక సంఘ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మునిసిపల్ కౌన్సిల్ పరిమితి లేకుండా చేపడుతున్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నిర్మాణానికి అనుమతి లేకుండానే శంఖుస్థాపనకు ముహుర్తం ఖరారు చేశారు. దీంతో మునిసిపల్ అనుమతి లేకుండా ఎలా కార్యక్రమం చేపడతారంటూ ఛైర్మన్ నిరసన దీక్షకు దిగడంతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది.

వివరాల్లోకి వెళ్లితే.. పట్టణ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీన్ని మునిసిపల్ కాలనీలో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. అయితే దీన్ని పురపాలక సంఘ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకించారు. మునిసిపల్ అనుమతి లేకుండా ఎలా కార్యాలయం నిర్మాణం చేపడతారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయినా సరే మేము అనుకొన్నదే జరుగుతుంది అన్న ధోరణిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఎస్పీ ఫకీరప్పల చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవన శంఖుస్థాపనకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం నేపధ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరించారు. మూడు రోజుల కిందట నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణంకు శ్రీకారం చుట్టడాన్ని నిరసిస్తూ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. దీంతో పట్టణ ప్రజలు ఏం జరుగుతుందోనని భయానికి లోనవుతున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి పోలీసు వ్యవస్ధ, ప్రభుత్వ పోలీసింగ్ గా మారిందని ప్రతిపక్షాలు నెత్తి, నోరు కొట్టుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: Narayana Swamy: చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చేదు అనుభవం

Exit mobile version