Ap Highcourt: ప్రభుత్వ పోలిసింగ్ అంటున్న ప్రతపక్షాల మాటలు కొన్ని సమయాల్లో అవుననే సమాధానం వస్తుంది. కొంత మంది పోలీసులు రాజకీయ నేతల అండదండలు చూసుకొని మరీ రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు, వ్యాపార వర్గాలపై వారు తీసుకొంటున్న నిర్ణయాలు ఏకంగా పోలీసు బాస్ మెడకు చుట్టుకొనేలా చేస్తున్నాయి. తాజాగా ఓ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డి స్వయంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
వివరాల మేరకు, రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధిస్తున్నారని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. నిబంధనలకు వ్యతిరేకంగా రైసు మిల్లులోని 5 వాహనాలను సీజ్ చేసారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది విరుద్ధమని ఆరోపించారు. అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నారని ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. అలాంటి సమయంలో చట్టం, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గతంలో అనేకసార్లు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదో వివరణ ఇవ్వాలని, ఇందుకు డీజీపీ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంలో అనేక పర్యాయాలు కీలక పదవుల్లో ఉన్న అధికారులు కోర్టు మెట్లు ఎక్కడం పరిపాటిగా మారింది.
ఇది కూడా చదవండి:AP ACB: ఏసీబీ వలలో ముగ్గురు రెవిన్యూ అధికారులు