TS High Court: హైకోర్టులో తెరాసకు చుక్కెదురు

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను  తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.

Munugode by poll: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను  తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.

Read Also: Munugode By poll: లెక్క ఖరారైంది… మునుగోడు ఉప పోరులో 47మంది అభ్యర్ధులు

కారు గుర్తును పోలిన కెమరా, చపాతీ రోలర్, పల్లకి, రోడ్ రోలర్, సబ్బు పెట్టె, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులు ఈవీఎంలో ఒకేలా ఉంటాయంటూ తెరాస కోర్టుకెక్కింది. అయితే ఎన్నికల ప్రక్రియ సాగుతున్నందున ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.