Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది. దీంతో సింగరేణికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
కోయగూడెం ఉపరితల గనిలో 187 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా 9కోట్ల గ్యాలన్ల నీరు క్వారీలోకి చేరింది. వరుసగా మూడు రోజులు ఇల్లందు టేకులపల్లి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడంతో పాటు 98 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. గనుల్లో వర్షపు నీరు నిలవడంతో ఆ నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.