Kapu Reservation: కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో
మాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసారు.
ఈడబ్ల్యుఎస్ 10% రిజర్వేషన్ లో కాపులు కీ 5% కల్పించాలని హరిరామజోగయ్య డిమాండ్ చేసారు.
రిజర్వేషన్ లేకపోవడం వల్ల కాపు విద్య, ఉద్యోగులు లో అన్యాయం జరిగిందని అన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి ని ప్రతి వాది చేర్చాలని కోరారు.
కాపు రిజర్వేషన్లకోసం దీక్షకు దిగిన హరిరామజోగయ్య..(Kapu Reservation)
కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్ లోహరిరామజోగయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
దీనిపై సానుకూలంగా స్పందించకపోతే జనవరి 1 నుంచి నిరాహారదీక్ష చేస్తానని కూడా ప్రకటించారు.
ఈ మేరకు ఆయన దీక్షకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఫోన్ చేసారు.
ఆరోగ్యపరిస్దితులను దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.
దీనితో హరిరామయ్య తన దీక్ష విరమించారు.
టీడీపీ హయాంలో కాపులకు రిజర్వేషన్లు..(Kapu Reservation)
కాపులకు 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును 2019, ఫిభ్రవరి లో శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కె అచ్చెన్నాయుడు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
దీనితో ప్రభుత్వ విద్యా సంస్థలు, ఉద్యోగాలు, ఉన్నత చదువుల్లో కాపులకు 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది.
ఈ డబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లలో మిగిలిన 5 శాతాన్ని కాపులకు అమలు చేయాలని నిర్ణయించారు.
కాపు రిజర్వేషన్లపై కేంద్రం కీలకప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెండర్ లో కీలక ప్రకటన చేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబునాయుడు
2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని స్పష్టం చేసింది.
కాపు రిజర్వేషన్లపై చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చింది.
ఈ మేరకు రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు
కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరంలేదని మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపారు.
ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి
2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన చట్టం చట్టబద్ధమేనని వివరించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/