Site icon Prime9

Mancherial district: మంచిర్యాల జిల్లా గురుకులపాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 16 మంది విద్యార్దులకు అస్వస్దత

Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ గురకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. సాయంత్రం స్నాక్స్ తిన్న తరువాత 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో 14మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండగా మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version