Site icon Prime9

GSLV MK3 Rocket Launch: తొలిసారిగా 6టన్నుల బరువైన ఉపగ్రహా ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

GSLV Mark 3 rocket launch

Sriharikota: భారత అంతరిక్ష పరిశోదన సంస్ధ ఇస్రో సరికొత్త మైలురాయిని అందుకోబోతుంది. ఒక రాకెట్ ద్వారా 6టన్నుల ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనతను చేజిక్కించుకోబోతుంది. అందుకు వేదికగా తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సిద్ధమైంది. నేటి అర్ధరాత్రి 12.07 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 – ఎం2 (ఎల్ఏఎం3) రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపనుంది.

విదేశీ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో భాగంగా మన దేశానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఐఎస్ఎల్) పూర్తి స్థాయిలో తొలి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. యునైటెడ్ కింగ్ డం దేశానికి చెందిన వన్ వెబ్ లిమిటెడ్ సంస్ధతో కుదుర్చుకొన్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేపట్టబోతున్నారు.
వాణిజ్య వ్యాపారంలో భాగంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తొలి బహుళ ఉపగ్రహ ప్రయోగాలను జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం2 రాకెట్ ద్వారా శ్రీకారం చుట్టింది. రాకెట్ ప్రయోగానంతరం 5796కేజీల బరువైన 36 ఉపగ్రహాలను భూమికి 1200కి.మీ ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) లోకి చేరుకోనున్నాయి.

జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగాల్లో నేటి ఎం2 రాకెట్ ప్రయోగం 5వ ప్రయోగంగా ఇస్రో పేర్కొనింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించిన 24కౌంట్ డౌన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది.

అధిక బరువైన ఉపగ్రహాలను నింగిలోకి చేర్చేందుకు జీఎస్ఎల్వీ రాకెట్ ఎంతో కీలకమైంది. జీఎస్ఎల్వీ రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు కాగ, ప్రయోగ సమయంలో 644 టన్నుల బరువుతో మూడు స్టేజీలతో రాకెట్ నింగిలోకి ఎగరనుంది. యస్ 200కు చెందిన రెండు ఘన ఇందన మోటార్లు, ఎల్ 110టన్నుల బరువుగల ఒక ధ్రవ ఇందనంతో పాటు సి25 క్రయోజినిక్ స్టేజీ రాకెట్ ప్రయోగంలో ఎంతో కీలకం.

నిర్ణయించిన కక్ష్యలోకి ఉపగ్రహాలను చేర్చే క్రమంలో లో ఎర్త్ ఆర్బిట్ లోని 12 వలయాల్లో ఈ ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు చేర్చనున్నారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన సమయం నుండి ఉపగ్రహాలను వరుస క్రమంలో వివిధ ప్రదేశాల్లో చేర్చే క్రమాన్ని శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతికత సాయంతో మానిటరింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన టెక్నాలజీని కూడా రాకెట్ లో పొందుపరిచారు.

లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశించే ఉపగ్రహాలను 12 వలయాల్లోకి చేర్చనున్నారు. ఒక్కో వలయంలో 49 ఉపగ్రహాలను చేర్చడం లక్ష్యంగా వన్ వెబ్ న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకొనింది. ఈ క్రమంలో మన దేశం నుండి జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా 36 ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు.

కక్ష్యలోకి చేరుకొన్న ఉపగ్రహాలు, అందులో పొందుపరిచిన కేఏ, కేయి బాండ్ పేలోడ్ల సాయంతో యాంటీనాల ద్వారా రాడారు కేంద్రాలు సంకేతాలు అందుకొంటాయి. ఒక ఉపగ్రహం ఒక్కసారి భూమి చుట్టూ పరిభ్రమించే క్రమంలో 109 నిమిషాల వ్యవద్ధి తీసుకొనేలా రూపకల్పన చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్కింగ్ సిస్టం కు సంబంధించిన లో లోటేన్సీ సర్వీస్ ను ప్రభుత్వాలకు, ప్రైవేటు రంగాలకు ఉపగ్రహ సేవలను కక్ష్యలోకి చేరుకొన్న ఉపగ్రహాల ద్వారా వన్ వెబ్ లిమిటెడ్ సంస్ధ అందివ్వనుంది. 2023లోపు 12 వలయాల్లోకి మొత్తం 588 ఉపగ్రహాలను చేర్చడం, వన్ వెబ్ లిమిటెడ్ లక్ష్యంగా ఇస్రో పేర్కొనింది. ఈ వాణిజ్య ఒప్పందంలో మన దేశానికి చెందిన ఇండియా భారతీ ఎంటర్ ప్రైజెస్ ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నట్లు ఇస్రో తెలిపింది.

Exit mobile version