Site icon Prime9

S. P. Balasubrahmanyam : గాన గంధర్వుడికి ఘోర అవమానం

Great insult to Gana Gandharva

Great insult to Gana Gandharva

S. P. Balasubrahmanyam: దశాబ్ధాల పాటు ఆయన కీర్తి అజరామం. తన గానంతో సప్త స్వరాలు పలికించారు. వేలాది పాటలు పాడిన ఘనత ఆయనది. దేశ విదేశాల్లో కోట్లాది సంగీత ప్రియుల మనసును దోచి అమరుడైన ఆ గాన గంధర్వుడికి గుంటూరులో ఘోర అవమానం చోటుచేసుకొనింది.

వివరాల్లోకి వెళ్లితే…ఏపీ ప్రభుత్వం విగ్రహాలతో రాజకీయాలకు తెరతీసింది. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో అనధికారికంగా విగ్రహాలు ఉండగా, రాజకీయం చేస్తూ ప్రముఖలు విగ్రహాలను కూల్చివేస్తుంది. కుప్ప తొట్టిల వద్దకు తరలిస్తూ శునకానందాన్ని ప్రవర్తిస్తుంది.

తాజాగా పలు భాషల్లో గాన గంధర్వుడిగా పేరొందిన ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని గుంటూరు పురపాలక సంఘ సిబ్బంది తొలగించారు. తీసేసిన విగ్రహాన్ని పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద పడేశారు. దీంతో కళాదర్బార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు నగరంలో రెండు వందల విగ్రహాలకు అనుమతి లేని కారణంగా తొలగిస్తున్నామని పురపాలక సంఘ సిబ్బంది పేర్కొంటున్నారు.

అయితే అన్ని విగ్రహాలకు లేని ఇబ్బంది కళామతల్లి బిడ్డ ఎస్పీకే వచ్చిందానని విచారం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మిపురం సెంటర్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కళాదర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సినీ కళాకారులు, సంఘాలు మండిపడుతున్నాయి.

మరో వైపు ప్రతిపక్ష పార్టీ తెదెపా కూడా ఎస్పీ విగ్రహం తొలగింపుపై విచారం వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ తీరును ఖండించింది. బహుముఖ ప్రజ్నాశాలి బాలు గారి విగ్రహాన్ని ప్రభుత్వమే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి:AP employees: 50శాతం ఏపీ ఉద్యోగులకు అందని జీతాలు

 

Exit mobile version