Site icon Prime9

Reservation Increase: కన్నడ నాట… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెంపు ఆర్డినెస్స్‌కు గవర్నర్ సై..

Governor of Karnataka has given Ordinance for the increase of SC and ST reservation

Governor of Karnataka has given Ordinance for the increase of SC and ST reservation

Karnataka: 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కర్ణాటక భాజపా అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతృత్వంలో రిజర్వేషన్ పెంపుపై తీసుకొన్న ప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తేవర్ చంద్ గహ్లాట్ ఆమోద ముద్ర వేశారు.

సమాచారం మేరకు, కర్ణాటక భాజపా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్ కోటాను పెంచేలా నిర్ణయం తీసుకొన్నారు. ఎస్సీలకు 15శాతం నుండి 17శాతానికి, ఎస్టీలకు 3శాతం నుండి 7శాతానికి పెంచుతూ బొమ్మై ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. స్పెషల్ గెజిట్ అనౌన్స్మెంటును కూడా ప్రభుత్వం పబ్లిష్ చేసింది.

మరి కొన్ని కులాలను కూడా జాబితాలో చేర్చడంతో కులాల సంఖ్య పెరిగింది, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభా గణనీయంగా పెరిగిందని ఆ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం తెలిపింది. సమగ్ర అధ్యయనం, విశ్లేషణ అనంతరం రిజర్వేషన్లను పెంచినట్టు నోటిఫికేషన్ పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని, ఇందువల్ల విద్య, ఉపాధి రంగంలో ఎస్సీ,ఎస్టీలకు మరిన్ని అవకాశాలు లభించి వారి జీవితాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆ పార్టీకి చేరువయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Minister Somanna: మహిళను చెంప చెళ్లుమనిపించిన కర్ణాటక మంత్రి

Exit mobile version