Site icon Prime9

Aadhar Card: ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. యూఐడీఏఐ వెల్లడి

uidai introduced A new method to Aadhar changes

uidai introduced A new method to Aadhar changes

Aadhar Card: భారతదేశంలో అతి ముఖ్యమైన ధృవీకరణ పత్రాల్లో ఒకటిగా ఆధార్ కార్డును చెప్పుకోవచ్చు. మొబైల్‌ సిమ్‌ దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే వరకు ప్రతీ ఒక్క పనికి ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి అయ్యింది. ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఆధార్ నంబర్ తో తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనితో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌ కార్డ్‌ను తీసుకోవాల్సి వస్తోంది. మనదేశంలో దాదాపు 134 కోట్ల మందికి ఆధార్ ఉంది. ఇటీవలి కాలంలో చిన్నారులకు కూడా ఆధార్‌ అందిస్తున్నారు. అయితే ఆధార్‌లో కార్డులో పేరులో తప్పులు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ లాంటివి అవసరానికి అనుగుణంగా ఈ మార్పులు చేర్పులు చేసుకునే వారు. అయితే ఇక నుంచి ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఈ క్రమంలోనే ఆధార్‌ కార్డ్‌ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై ఆధార్ కలిగిన ప్రతీ ఒక్కరూ కనీసం 10 ఏళ్లకు ఒక్కసారైనా ఆధార్‌ బయోమెట్రిక్స్‌ లేదా అడ్రస్‌ లాంటివి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గతేడాది దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది తమ ఆధార్‌ కార్డ్‌లను అప్‌డేట్‌ చేసుకున్నారు. పదేళ్ల క్రితం ఆధార్‌ కార్డ్‌ను తీసుకున్నవారు డాక్యుమెంట్ అప్‌డేటేషన్‌ చేసుకోవాలని యూఐడీఏఐ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఈ నెల 19, 20ల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్

Exit mobile version