Site icon Prime9

Assam: ఎంత ఘాటు ప్రేమయో.. హెచ్ఐవి బాధిత ప్రియుడి రక్తాన్ని తనకు ఎక్కించుకున్న బాలిక

Assam: ప్రేమ గుడ్డిది, హద్దులు చూడదు అంటారు. అస్సాంలోని ఒక టీనేజ్ అమ్మాయి తన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన విపరీత చర్య చూసాక ఈ సామెత గుర్తుకు రాక మానదు. అసోంలోని సుల్‌కుచి జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన ప్రేమను గొప్పగా చాటుకునే ప్రయత్నంలో తన ప్రియుడి హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించింది.

హజోలోని సత్డోలాకు చెందిన హెచ్‌ఐవి-పాజిటివ్ యువకుడు ఫేస్‌బుక్ ద్వారా 15 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమ ఎంతవరకూ వెళ్లిందంటే వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్దితికి దారితీసింది. దీనితో వారిద్దరు కలిసి పారిపోయేందుకు కూడ సిద్దమయ్యారు. అయితే బాలిక తల్లిదండ్రులు అప్రమత్తమవడంతో అది సాధ్యపడలేదు.

ఇలా వుండగా సదరు బాలిక ఈసారి ఎవరూ ఊహించని పని చేసింది. హెచ్‌ఐవి సోకిన తన ప్రేమికుడి నుంచి తీసుకున్న రక్తాన్ని సిరంజితో ఆ బాలిక తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకుంది. దీనితో హతాశులైన బాలిక తల్లిదండ్రులు ప్రేమికుడి పై న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమ ఎంత గుడ్డిదో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar